అక్టోబర్ 2న ముంబైలో CJP ‘జైల్ భరో’!
అస్సాంలో CJP కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా సహా 40 మందికి పైగా వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. తాను రేపు వారిని కలవాల్సి ఉందని.. తనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఆశుతోష్ రాంకాతో కలిసి ముంబైకి వచ్చి అక్టోబర్ 2న శాంతియుత ‘జైల్ భరో’ ప్రొటెస్ట్ చేస్తామని చెప్పారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రొటెస్ట్‌కు పర్మిషన్ ఇవ్వలేదని.. అయినా ప్రజాస్వామ్యం, ఓటు హక్కు కోసం నిరసన చేస్తామని తెలిపారు.
