టికెట్లలో పైరవీలేదు.. అరకు ఎమ్మెల్యే ప్రకటన

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని మాదల, లోతేరు, గన్నెల, ఇరగాయి పంచాయతీల్లో YCP సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. టికెట్లలో పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. కార్యకర్తలే అభ్యర్థులను సూచించాలని, పార్టీ బీ-ఫామ్ ఇస్తుందని అన్నారు. నందివలస స్కూల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వాభి రామ్మూర్తి, కమ్మిడి అశోక్, కిల్లో రామన్న, విజయ్‌కుమార్, పాంగి నగేష్, కొర్ర అర్జున్‌రావు పాల్గొన్నారు.



