← Back to news

గవర్నమెంట్ స్కూళ్లలో AI టెక్నాలజీ

By DK· 30 Jun 2026
గవర్నమెంట్ స్కూళ్లలో  AI టెక్నాలజీ

AP విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు నమోదు కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడానికి, హాజరు పారదర్శకతకు, కచ్చితత్వానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

More in Education