టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటిన శ్రీవిద్య

జగిత్యాల జిల్లా వెల్గటూర్ ZPHSకు చెందిన 9వ తరగతి విద్యార్థిని గజ్జల శ్రీ విద్య టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటి 70వ SGF రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా శ్రీ విద్యను పాఠశాల HM కొండల్ రెడ్డి, PD రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ శ్రీవిద్య మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.



