అరకు స్టూడెంట్స్ సత్తా.. రాష్ట్ర అథ్లెటిక్స్‌కు సెలెక్ట్..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్. ఐదుగురు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు. పోటీలు అక్టోబర్ 2 నుంచి 4 వరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతాయి. అండర్-16 లాంగ్‌జంప్‌లో డి. అశోక్, ఎం. ఆదిత్య, హైజంప్‌లో జి. కార్తీక్, జావెలిన్‌లో జి. సురేష్, అండర్-14 ట్రయాథ్లాన్‌లో కె. చంద్రకాంత్ పోటీపడతారు. ప్రిన్సిపల్ మూర్తి, కోచ్ కొండలస్వామి శుభాకాంక్షలు తెలిపారు.



