ఎవరేం చేశారో అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: CM

TG: పదేళ్ల BRS పాలనలో ఏంచేశారు.. రెండున్నరేళ్లలో మేం ఏంచేశామో అసెంబ్లీలో చర్చిద్దాం.. సిద్ధమా? అని KCRకు CM రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశామని తెలిపారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి రూ.90వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రైతు రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.



