← Back to news

ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి బంగారం దోచేశారు

By DK· 1 Aug 2026· హైదరాబాద్
ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి బంగారం దోచేశారు

TG: హైదరాబాద్‌లోని చందానగర్‌ బాలాజీ జ్యువెలరీ షాప్‌లో నిన్న అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు, తలుపుకు రంధ్రం చేసి సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తుండగా, CCTV ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.