PM డిగ్రీపై హైకోర్టు కామెంట్స్

గుజరాత్ హైకోర్టు మోదీ ఎడ్యుకేషనల్ డిగ్రీల వివాదంపై వివరణ ఇచ్చింది. PM విద్యార్హతలను పబ్లిక్ చేయడంలో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని, డిగ్రీ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆయన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధి అని, రాజ్యాంగబద్ధమైన ఆ పదవికి ఆయన చదువుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను రిజెక్ట్ చేస్తూ, ఆయనపై 25,000రూపాయలు ఫైన్ విధిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను కోర్టు సమర్థించింది.


