← Back to news

మహారాష్ట్రలో 3/4 ప్రాంతం కరువే!

By Mahesh· 4h ago· Down to earth· Maharashtra
మహారాష్ట్రలో 3/4 ప్రాంతం కరువే!

మహారాష్ట్రలో కరువు ఎఫెక్ట్ సీరియస్‌గా ఉంది. వర్షాలు తక్కువగా, మధ్య మధ్యలో కురవడంతో 358 తాలూకాల్లో 265 చోట్ల ప్రభుత్వం కరువు ప్రకటించింది. మరాఠ్వాడా, విదర్భతో పాటు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సోయాబీన్, ఉల్లి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఆఫీసర్లు ఫీల్డ్ సర్వేలు చేస్తున్నారు. రైతులకు లోన్ రీస్ట్రక్చరింగ్, కరెంట్ బిల్ రాయితీలు వంటి రిలీఫ్ ప్రకటించినా.. డైరెక్ట్ పంట నష్ట పరిహారం ఇంకా ఖరారు కాలేదు.

More in Current Affairs