ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి

గోదావరి, శబరి నదుల వరదలతో పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎటపాక మండలంలో మిరప తోటలు నీటమునగగా, చింతూరు, విఆర్ పురం మండలాల్లో వరి పంటలు ముంపునకు గురయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే పంటల సాగు ఆలస్యమైన నేపథ్యంలో.. ఇక వరదలు రావని భావించిన రైతులు ఇటీవల నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో వరి నాట్లు వేశారు. ఇటీవల వచ్చిన వరదలతో కొత్తగా వరి పొలాలు నీటమునిగాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.





