← Back to news

మరో అల్పపీడనం.. భారీ వర్షాల అలర్ట్!

By Krishna· 1d ago· Gov
మరో అల్పపీడనం.. భారీ వర్షాల అలర్ట్!

శ్రీలంకకు తూర్పున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దాని సుడి గంటకు 44 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. అది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. భారత వాతావరణ శాఖ - IMD ప్రకారం ఇవాళ సెప్టెంబర్ 14న తెలంగాణలో ఉరుములు, పిడుగులతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 20 వరకూ అక్కడక్కడా జల్లులు పడతాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. రేపు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అలర్ట్ ఉంది.

More in Current Affairs