Mobile పోయిందా? ఇలా చేయండి

మొబైల్ పోయినా లేక ఎవరైనా దొంగిలించినా <a href="https://www.ceir.gov.in/Home/index.jsp#">CEIR పోర్టల్</a>, మొబైల్ యాప్ ద్వారా బ్లాక్, అన్‌బ్లాక్ చేయవచ్చు. ముందుగా పోలీసులకు కంప్లైంట్ చేసి, తర్వాత పోర్టల్ లోకి వెళ్లి ఫోన్ నంబర్, IMEI, పోలీస్ కంప్లయింట్ వివరాలు ఎంటర్ చేసి.. బ్లాక్ రిక్వెస్ట్ పంపాలి. బ్లాక్ చేసిన తర్వాత ఆ ఫోన్‌లో మరో SIM వేసినా మొబైల్ నెట్‌వర్క్ పనిచేయదు. ఫోన్ దొరికితే CEIRలోనే అన్‌బ్లాక్ కూడా చేయవచ్చు. పోయిన మొబైల్‌ను గుర్తించడంలో పోలీసులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.



