మాంసం ప్రకటనలపై నిషేధం కోరిన PETA INDIA

అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుండి దేశవ్యాప్తంగా మాంసం ప్రకటనలపై నిషేధం విధించాలని జంతు హక్కుల సంస్థ PETA India కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆ సంస్థ లెటర్ రాసింది. మహాత్మా గాంధీ పాటించిన అహింసా సిద్ధాంతంపై గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చింది. టీవీలు, బిల్ బోర్డులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర మీడియాల్లో మాంసాన్ని ప్రోత్సహించే అన్ని ప్రకటనలను నిషేధించాలని డిమాండ్ చేసింది.
