← Back to news

మిషన్ భగీరథ నీటి కోసం ఎదురుచూపులు

By Bala· 1d ago
మిషన్ భగీరథ నీటి కోసం ఎదురుచూపులు

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌గూడలో లక్షల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్‌ నిరుపయోగంగా మారింది. ప్రధాన పైప్‌లైన్‌లో నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు ప్రత్యామ్నాయ నీటి వనరులపై ఆధారపడుతున్నారు. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించి, ఇంటింటికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local