రంగాపూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఇవాళ సీఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కర్ధన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.



