సీఈసీ రాజీనామా.. ప్రజాసంఘాల డిమాండ్

మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ సీపీఐ నేత అందె నాసరయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్వతంత్ర నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు రుతికా చోప్రా వెలుగులోకి తెచ్చిన అంశాలపై విచారణ జరపాలన్నారు. సమావేశంలో షేక్ అబ్దుల్ రజాక్, డి. సోమయ్య తదితరులు పాల్గొన్నారు.



