యువత రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి

జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ పిలుపునిచ్చారు. యాక్సిడెంట్లు, ఆపరేషన్లు, ప్రసవాలు వంటి అత్యవసర టైమ్‌లో రక్తం అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడుతుందన్నారు. యువత తమ బర్త్‌డేలు, వెడ్డింగ్ డేలను బ్లడ్ డొనేషన్ చేసి స్పెషల్‌గా మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో బ్లడ్ షార్టేజ్ రాకుండా యూత్, స్వచ్ఛంద సంస్థలు డొనేషన్ క్యాంపుల్లో పాల్గొనాలని కోరారు.



