యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యమధర్మరాజు స్వామివారికి పురుషసూక్తం, శ్రీ లక్ష్మీసూక్తం, మన్యుసూక్తంతో అభిషేకం చేశారు. అనంతరం ఆయుష్య హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, వేదపండితులు ఓంకార శర్మ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.



