← Back to news

కోస్తా వైపు వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్

By Krishna· 17h ago· Gov
కోస్తా వైపు వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్

బంగాళాఖాతంలో వాయుగుండం సుడిగాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఇది కొద్దిగా దిశ మార్చుకుంటూ.. ఉత్తరాంధ్ర, కోస్తా వైపుగా వస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం 24న ఉత్తరాంధ్ర దగ్గర తీరం దాటేలా కనిపిస్తోంది. దీని కారణంగా.. ఏపీ, తెలంగాణకు సెప్టెంబర్ 26 వరకూ అకడక్కడా భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ - IMD చెప్పింది. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయనీ, బలమైన ఈదురు గాలులు వీస్తాయని IMD హెచ్చరించింది.

More in Current Affairs