← Back to news

అక్కావ పంచాయతీ నిధులపై ఆరోపణలు

By Bala· 1d ago
అక్కావ పంచాయతీ నిధులపై ఆరోపణలు

అచ్చంపేట మండలం అక్కావ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆరోపిస్తూ నిన్న కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ నిధుల నుంచి లక్షలు రూపాయిలు డ్రా చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరారు.

More in Local