భారత్‌లోనే చిప్స్ తయారైతే.. మనకు ఏం లాభం ?

మన మొబైల్, కార్లు, కంప్యూటర్లు, AI వంటి వాటిలో చిప్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి భారత్‌లోనే ఎక్కువగా తయారైతే.. ఇతర దేశాల నుంచి చిప్స్ తెచ్చుకోవాల్సిన అవసరం కొంత తగ్గుతుంది. చిప్ ఫ్యాక్టరీలతో పాటూ.. డిజైన్, ప్యాకేజింగ్, టెస్టింగ్, మెషిన్ల తయారీ వంటి రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతులు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే.. చిప్స్ తయారీ పెరిగితే భారత్‌లో మొత్తం ఎలక్ట్రానిక్స్ రంగం బలపడొచ్చు.



