← Back to news

ప్రజ్వల్‌ రేవణ్ణ బ్యారక్‌లో ఫోన్‌.. జైలు ఆఫీసర్ సస్పెండ్

By Mahesh· 13 Aug 2026· బెంగళూరు

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో మాజీ MP ప్రజ్వల్‌ రేవణ్ణ బ్యారక్‌లో బ్యాన్‌ చేసిన వస్తువులు ఉండడం కలకలం రేపింది. CCB అధికారులు చేసిన సడన్‌ చెకింగ్‌లో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌ స్వాధీనం చేసుకున్నారు. రేవణ్ణ మరో ఖైదీ ప్రతాప్‌ రాయ్‌తో కలిసి ఉన్న బ్యారక్‌లో మంచం కింద ఫోన్‌ దొరికినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ లోపంపై జైలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయగా, సూపరింటెండెంట్‌కు షోకాజ్‌ నోటీస్ ఇచ్చారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.