సైబరాబాద్‌లో చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు!
TG: హైదరాబాద్ నుంచి ఏపీకు చికెన్ వేస్టును అక్రమంగా తీసుకెళ్తున్న మాఫియాపై సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను రికవరీ చేసుకున్నారు. ఈ వ్యర్థాలను రాత్రివేళల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు ఆమూతున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.


