హామీ అమలు చేయకపోతే స్కూటీలు తీసుకెళ్లండి

TG: నిజామాబాద్‌లో నిర్వహించిన 'ఇందూర్ రణభేరి' కార్యక్రమంలో ఆర్మూర్ MLA రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూమ్‌ల నుంచి విద్యార్థినులు స్కూటీలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే చలో కొడంగల్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.



