జర్నలిస్ట్‌పై ACP ప్రవర్తన.. FIR డిమాండ్
ఢిల్లీలో నేహా బోరా ప్రొటెస్ట్‌ను కవర్ చేస్తున్న సమయంలో ఓ ACP తనపై దురుసుగా ప్రవర్తించి, ఛాతీపై చేయి వేసి తోసేశారని మహిళా జర్నలిస్ట్ Rosie ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ లేకపోవడంపై ప్రశ్నించినందుకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఘటనపై FIR రిజిస్టర్ చేయాలని కోరుతూ మహిళా జర్నలిస్టులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. ACP తనకు కెమెరా ముందు క్షమాపణ చెప్పి, ఇష్యూపై చర్యలు తీసుకోవాలని Rosie డిమాండ్ చేశారు.

