అయ్యో గర్భిణులు.. గాల్లో ప్రాణాలు!

బీహార్‌లోని జముయి సదర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆదివారం ఇద్దరు గర్భిణులు చనిపోయారు. డాక్టర్స్ అందుబాటులో లేక సకాలంలో ట్రీట్మెంట్ అందలేదని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నారు. అనితా కుమారి (28) డెలివరీ ముందే చనిపోగా, ఆస్తా కుమారి (26) ఆపరేషన్ తర్వాత పరిస్థితి విషమించి చనిపోయింది. డాక్టర్స్ నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు హాస్పటల్ వద్ద మృతదేహాలతో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ హాస్పిటల్ సందర్శించి డాక్టర్స్ పై ఎంక్వయిరీ ఆదేశించారు.



