ప్రభుత్వ పాఠశాలలపై నీతి అయోగ్ షాకింగ్ రిపోర్ట్

దేశంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై నీతి అయోగ్ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 1.19 లక్షలకుపైగా స్కూళ్లలో కరెంట్ లేదు. 14,500కి పైగా స్కూళ్లలో తాగునీరు సరిగా లేదు. దాదాపు 98 వేల స్కూళ్లలో అమ్మాయిలకి టాయిలెట్ సౌకర్యం లేదు. 61 వేలకు పైగా స్కూలు టాయిలెట్స్ వాడేటట్టుగా లేవు. ఇక చదువు చెప్పే టీచర్ల పరిస్థితి అంతంత మాత్రమే. కేవలం 10 నుంచి 15 శాతం టీచర్లు మాత్రమే తాము చెప్పే సబ్జెక్టులో విద్యార్థుల పాస్ పెర్సంటేజ్ 60శాతం దాటిన వారున్నారు. అందుకే స్కూళ్లలో డ్రాపవుట్లు ఎక్కువైపోయి, ప్రైవేటు స్కూళ్ల వైపు వెళుతున్నారని నీతి అయోగ్ తన నివేదికలో వివరించింది.


