అరకు టూరిజం స్పాట్లలో స్పెషల్ డ్రైవ్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 సందర్భంగా మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్‌తో పాటు పద్మాపురం, సుంకరమెట్ట, మాడగడ, పెదలబుడు గ్రామపంచాయతీల పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ మాదాంశెట్టి శ్రీధర్, MPDO వీసం ప్రసాద్, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పాత్రుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.



