← Back to news

గణేశ్ లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు

By dk· 7 Aug 2026· హైదరాబాద్
గణేశ్ లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు

TG: గతేడాది హైదరాబాద్‌లోని మైహోం భూజలో రూ.51 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న కొండపల్లి గణేశ్‌పై సైబరాబాద్ EOWలో కేసు నమోదైంది. లడ్డూ వేలం దక్కించుకుని అందరిలో ధనవంతుడనే పేరు సంపాదించుకున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెలకు 6శాతం లాభం ఇస్తామని నమ్మించి సిల్వియా దంపతుల నుంచి రూ.31లక్షలు తీసుకున్నాడు. లాభాలు ఇవ్వకుండా అతడు తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు ఆరా తీశారు. అప్పటికే గణేశ్, అతని సహచరుడు ఇళ్లను ఖాళీ చేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ.3.45కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.