← Back to news

పోలీసుల దౌర్జన్యంపై నేహా బోరా ఫైర్

By Sahani· 3h ago· X· Delhi

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర AISA చేపట్టిన ప్రొటెస్ట్‌లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై నేహా బోరా తీవ్రంగా మండిపడ్డారు. అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు.. బారికేడ్లు దాటేందుకు యత్నించిన నేహా బోరాను, ఇతర విద్యార్థి నాయకులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. తమపై జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. "ఇదా ఢిల్లీ పోలీసుల శాంతి, సేవ, న్యాయం!" అంటూ నేహా <a href="https://x.com/neha_aisa/status/2106347648857075876?s=20">ట్వీట్</a> చేశారు.

More in Current Affairs