శాంతియుత నిరసనలపై నిర్బంధమా? అభిజీత్ దీప్కే

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ పోలీసులు ప్రవర్తిస్తున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. నిరసనకారులను అణచివేయడం ద్వారా ఢిల్లీ పోలీస్ వ్యవస్థ దేశానికే కాకుండా, ఆ సంస్థకు కూడా అవమానాన్ని తెచ్చిపెడుతోందని విమర్శించారు. ముంబై పోలీసులను చూసి ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న వాళ్లపై పోలీసులు అనవసర బలాన్ని ప్రయోగించి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

