పోలీసుల అదుపులో నేహా బోరా
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నాయకురాలు నేహా బోరాను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తాము నిరసన తెలుపుతుండగా ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి, పోలీసు బస్సుల్లో తీసుకెళ్లారని నేహా బోరా Xలో తెలిపారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


