సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులు

ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటు గ్రూప్ సౌదీ అరేబియాపై భారీ దాడులు చేసింది. హౌతీలు యెమెన్‌లోని ఉత్తర, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆధిపత్యం కలిగిన సాయుధ-రాజకీయ ఉద్యమం. సౌదీలోని అబ్హా, జిజాన్, నజ్రాన్, ఖమీస్ ముషైత్ ప్రాంతాల్లోని చమురు, ఆర్థిక, ఇతర కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేశారు. దాడులతో పలు చోట్ల మంటలు చెలరేగి కొన్ని ఎనర్జీ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ ఘటనల్లో 73 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు.



