← Back to news

రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ చర్చలు?

By A.Ajay· 13h ago
రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ చర్చలు?

రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య మరోసారి త్రైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని జెలెన్‌స్కీ చెప్పారు. సెప్టెంబర్‌లోనే చర్చలు జరిగితే బాగుంటుందని, వీలైనంత త్వరగా జరగాలని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో, కీవ్‌లో విడివిడిగా చర్చించారు. యుద్ధాన్ని ముగించేందుకు కొన్ని మంచి ప్రతిపాదనలు వచ్చాయని జెలెన్‌స్కీ చెప్పారు. చర్చలకు టర్కీ, UAE, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఏదైనా వేదిక కావచ్చని అంచనా.

More in International