మేడారం గుడిలో 'ది ప్యారడైజ్ ' మూవీ టీం
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయంలో ‘ది ప్యారడైజ్’ మూవీ టీం పూజలు చేసింది. "సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆలయంలో మొక్కులు చెల్లించాం" అని చెప్పింది మూవీ టీం. అమ్మవారికి నటుడు నానీ, తన బరువుకి సరిపడా బెల్లాన్ని.. బంగారు కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది.. మూవీ టీంని అభినందించింది.



