నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ మూవీకి బిగ్ రీచ్

రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘ఇరుముడి’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లిష్ సినిమాల లిస్టులో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్‌లోకి రావడంతో మూవీ రీచ్ మరింత పెరిగింది. ఓటీటీ సక్సెస్‌తో మూవీపై సోషల్ మీడియాలోనూ మళ్లీ చర్చ పెరిగింది


