← Back to news

బెంగాల్‌లో గణేశ్ పూజలో మోదీ విగ్రహం కాంట్రవర్సీ

By Vishi· 1d ago· Ndtv

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరా జిల్లా బెలూర్ బజార్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం ఉంచడం కాంట్రవర్సీగా మారింది. ప్రధాని మోదీ, గణేశుడు కలిసి కూర్చుని టీ తాగుతున్నట్లు చూపించారు. ‘చాయ్ పే చర్చ’ థీమ్‌తో ఇలా అమర్చారు. వెనుక ‘హిందూ రాష్ట్రం’ అని రాసి, భారత మ్యాప్, హిందూ జెండా కూడా ఉంచారు. హౌరా జిల్లా బీజేపీ కార్యదర్శి ఓంప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ ఇందులో తప్పేమీ లేదని, బెంగాల్‌లో దుర్గా పూజల్లోనూ పలు రకాల థీమ్‌లు ఉంటాయని చెప్పారు.

More in Current Affairs