కండక్టర్‌గానే ఫీల్ అవుతున్న రజినీ!

సూపర్‌స్టార్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నా.. తన పాత ఉద్యోగాన్ని రజినీకాంత్ మర్చిపోలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఐదేళ్ల పాటు బస్ కండక్టర్‌గా పనిచేశానని, ఇప్పటికీ ఆ జాబ్‌ను మిస్ అవుతున్నానని చెప్పారు. బెంగళూరులో ఖాకీ యూనిఫామ్‌లో కండక్టర్లను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. తనను తాను ఇప్పటికీ సూపర్‌స్టార్‌గా కాకుండా బస్ కండక్టర్‌గానే భావిస్తానని తెలిపారు. Jailer 2 ప్రమోషన్ ఈవెంట్లో రజినీ చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


