← Back to news

D.K. శివకుమార్‌కు అవమానం?

By A.Ajay· 2h ago

ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి D.K శివకుమార్‌కు ఎదురైన పరిస్థితి రాజకీయంగా చర్చకు దారితీసింది. రద్దీ మధ్య రాహుల్ గాంధీ ఆయనను వెనక్కి లాగినట్లు, ఆ తర్వాత రాహుల్ భద్రతా సిబ్బంది, కార్యకర్తల మధ్య తోపులాటలో D.K. ఇబ్బంది పడినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కర్ణాటక BJP అధ్యక్షుడు B.Y. విజయేంద్ర స్పందిస్తూ, ఇది కన్నడ ప్రజల గౌరవానికి అవమానమని విమర్శించారు. అయితే, ర్యాలీలో తీవ్ర రద్దీ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

More in National