దేశానికి పోలియో వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది?

మన దేశానికి పోలియో వ్యాక్సిన్ 1995 తర్వాత వచ్చిందని చాలామంది అనుకుంటారు. అయితే శాస్త్రవేత్త Albert Sabin అభివృద్ధి చేసిన ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1963లో అమెరికాలో లైసెన్స్ పొందింది. Sabin స్వయంగా భారత్‌కు వచ్చి Pasteur Institute of India (Coonoor)ను OPV ఉత్పత్తికి సిఫార్సు చేశారు. 1964లో ముంబై సిటీ కార్పొరేషన్ దిగుమతి చేసుకున్న OPVతో పోలియో టీకాలు వేయడం స్టార్ట్ చేసింది. 1995 ‘పల్స్ పోలియో’ ద్వారా OPVని ఉపయోగించి, పిల్లలందరికీ ఒకేసారి చుక్కలు వేసే మాస్ సప్లిమెంటరీ ఇమ్యూనైజేషన్ క్యాంపెయిన్ చేశారు.



