అలియా భట్ ‘గ్లో’ వెనుక అసలు సీక్రెట్ ఇదే
బాలీవుడ్ క్వీన్ అలియా భట్ ఫిట్‌నెస్ లెవల్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్! 12 గంటల షూటింగ్ ఉన్నా సరే, జిమ్‌ను అస్సలు స్కిప్ చేయదని ఆమె ట్రైనర్ కరణ్ సాహ్నీ రీసెంట్‌గా రివీల్ చేశారు. "అల్ట్రా డిసిప్లిన్" పాటిస్తూ హెల్దీ డైట్ తీసుకోవడం, హాయిగా నిద్రపోవడం ఆమె అందానికి, ఎనర్జీకి కారణమట. ఒక పక్క బిజినెస్, మరోపక్క కూతురు రాహా బాధ్యతలు చూసుకుంటూనే బాడీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తోందీ సూపర్ మామ్. అలియా డెడికేషన్ చూసి నెటిజన్లు ‘నెక్స్ట్ లెవల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనకి కూడా కొంచెం ఆ డిసిప్లిన్ ఉంటే ఎంత బాగుండు!



