పల్లెల్లోనూ Digital చెల్లింపులు

పల్నాడు జిల్లాలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలకే పరిమితమైన UPI పేమెంట్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌ల ద్వారా ప్రజలు నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు. టీ నుంచి కూరగాయలు, కిరాణా సరుకుల కొనుగోలు వరకు UPI పేమెంట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డిజిటల్ చెల్లింపుల విధానం గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్పుకు దారితీస్తోంది.



