NH16లో కారు డివైడర్ ఎక్కి నిలిచింది.. అదృష్టం!
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం తగరపువలసలో తాజాగా ఘటన. NH16పై అవంతి కాలేజీ ఎదురుగా ఓ కారు డివైడర్ ఎక్కింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు, ముందున్న లారీని ఓవర్ టేక్ చేయబోయింది. అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లి నిలిచింది! అదృష్టవశాత్తు కారులో ఉన్నవారిలో ఎవరికీ తీవ్ర గాయాలు లేవు. ఓవర్ టేకింగ్ ప్రాణాలకు ముప్పు అని గుర్తుంచుకోండి!



