← Back to news

మేడ్చల్‌లో రోడ్డుపై స్కూల్ విద్యార్థుల ధర్నా

By Vishi· 16h ago

TG: మేడ్చల్‌లోని సురారం స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్ బస్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదంటూ విద్యార్థుల నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా కూర్చొని రోడ్డుపైనే బైఠాయించారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిపో మేనేజర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని చెప్పారు. బస్‌షెల్టర్ వద్ద ఆగకుండా వెళ్తున్న బస్సులకు అడ్డుగా వెళ్లి విద్యార్థులు నిరసన చేపట్టారు.

More in TG