భార్యపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే
UPలోని దిబాయ్ మాజీ ఎమ్మెల్యే, సమాజ్‌వాది పార్టీ నాయకుడు గుడ్డు పండిత్(శ్రీభగవాన్ శర్మ) తన మూడో భార్య అర్చనా పండిత్‌పై దాడి చేసినట్లు కనిపిస్తున్న వీడియో బయటపడింది. వీడియోలో గుడ్డు పండిత్ ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగుతూ నేలపై ఈడ్చుకుపోతున్న విజువల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మహిళా విభాగ నాయకురాలు అర్చనా పండిత్ శికార్‌పూర్ PCలో కంప్లైంట్ చేశారు. తను, తన కొడుకు పండిత్, అతని కుటుంబ సభ్యుల నుంచి చావు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.



