మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి కొడుకు అరెస్ట్

గుజరాత్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు గీతా పటేల్ కొడుకు హరికేశ్ ప్రణవ్ పటేల్‌ను గుజరాత్ ATS(యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్) అరెస్ట్ చేసింది. ఫేక్ డాక్యుమెంట్లతో మరో పాస్‌పోర్ట్ పొందినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఒరిజినల్ పాస్‌పోర్ట్ కోర్టులో ఉన్నప్పటికీ రెండో పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు ATS తెలిపింది. ఈ పాస్‌పోర్ట్‌తో బ్యాంకాక్, దుబాయ్, సింగపూర్‌కు వెళ్ళినట్లు తెలిసింది. ఫేక్ డాక్యుమెంట్లు, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలపై ATS విచారణ చేస్తోంది.



