← Back to news

మహారాష్ట్ర ఆసుపత్రుల్లో సామగ్రికి భారీ ధరలు

By Anusha· 5h ago· Indiatimes
మహారాష్ట్ర ఆసుపత్రుల్లో సామగ్రికి భారీ ధరలు

మహారాష్ట్రలో కొన్ని ఆసుపత్రులు వైద్య సామగ్రి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు FDA సర్వేలో తేలింది. FDA కమిషనర్ తుకారాం ముంధే ఈ వివరాలు వెల్లడించారు. 11.05 రూపాయలకు వచ్చే IV సెట్‌ను 325 రూపాయలకు, 6.75 రూపాయల సిరింజ్‌ను 57.20 రూపాయలకు, 29.41 రూపాయల క్యాతెటర్‌ను 310 రూపాయలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. పేస్‌మేకర్లు, హార్ట్ వాల్వ్‌ల ధరలు కూడా వాటి కొనుగోలు ధర కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. రోగులపై అదనపు ఖర్చు పడుతోంది. ఈ ధరలపై పరిమితి పెట్టాలని FDA ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

More in National