IndiGoలో కొత్త ఛార్జీలు.. ఇకపై ఎంతంటే?

IndiGo ప్రయాణికులకు అదనపు ఖర్చులు పెరిగాయి. ఎక్స్‌ట్రా బ్యాగేజీ ఛార్జీ కిలోకు 7వందల నుంచి 800 రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ 2వేల నుంచి 3వేల రూపాయలకు చేరింది. పెద్దలు లేకుండా జర్నీ చేసే 5 నుంచి 12 ఏళ్ల పిల్లల అన్‌అకంపెనీడ్ మైనర్ సర్వీస్ దేశీయ విమానాల్లో 5,999కు హైక్ చేసింది. Fast Forward ప్రియారిటీ చెక్-ఇన్, బోర్డింగ్ ఫీజు 500 నుంచి 650కి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఒక్కో సెగ్మెంట్‌కు 850 రూపాయలకు పెరిగింది.



