గ్రామ మ్యాప్‌పై అవగాహన

గ్రామాభివృద్ధి ప్రణాళికలో గ్రామ మ్యాప్ ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ నర్రముల రామలింగయ్య తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం పుల్లాయిగూడెంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో VB-G RAM G పథకం ద్వారా రూపొందించిన గ్రామ మ్యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే ఎల్-నినో పరిస్థితుల్లో నీటి కొరతను ఎదుర్కొనేలా చెరువులు, వ్యవసాయ భూముల వివరాలను టెక్నికల్ అసిస్టెంట్ వివరించారు.



