అంబేద్కర్ కూడలిపై రౌండ్ టేబుల్ సమావేశం

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో డాక్టర్ B.R. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు, అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు UTF భవనంలో ఈ సమావేశం జరగనుంది. విగ్రహం ఏర్పాటు, కూడలి అభివృద్ధిపై చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానికి అంబేద్కర్ అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు హాజరై తమ సూచనలు, సలహాలు అందించాలని నిర్వాహకులు కోరారు.



